HomeMovie Newsమాచర్ల నియోజకవర్గం ఓటిటి విడుదల తేదీ ఖరారు

మాచర్ల నియోజకవర్గం ఓటిటి విడుదల తేదీ ఖరారు

- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నితిన్ ఒకరు. ఇటీవల మాచర్ల నియోజక వర్గం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే మాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనుకున్న నితిన్ కు ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. తాజాగా ఈ సినిమా OTT విడుదల తేదీ ఖరారు అయింది.

ఎట్టకేలకు డిసెంబర్ 9న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అయిన Zee5లో సినిమా విడుదలవుతుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఆ రకంగా థియేటర్లలో విడుదలైన 120 రోజుల తర్వాత అంటే 4 నెలల తరువాత ఓటిటి లో అందుబాటులోకి వస్తుంది అన్నమాట.

ఈ రోజుల్లో, దాదాపు అన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైన 4 వారాల్లోనే OTTలో విడుదల అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా, ఈ చిత్రం OTT లో విడుదల కావడానికి చాలా సమయం పట్టింది. ఈ సినిమా OTT విడుదల పై ప్రేక్షకులు కొన్ని రోజులుగా చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక ఈ వార్తతో చివరకు వారి కోరికలు నెరవేరినట్లే.

మాచర్ల నియోజకవర్గం నితిన్ ప్రధాన పాత్రలో MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్D ఎంటర్‌టైనర్. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ మూవీస్ బ్యానర్‌ పై సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

See also  సమంత యశోద పై సివిల్ కేసు దాఖలు చేసిన ఈవా ఆసుపత్రి.. వాయిదా పడిన సినిమా OTT విడుదల

మాచర్ల నియోజక వర్గం ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా 950 వరకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. విడుదలకి ముందే ట్రైలర్,టీజర్స్ తో మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తర్వాత మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతే కాదు తమ అభిమాన హీరో నుంచి మంచి హిట్‌ వస్తుందని ఆశించిన నితిన్ అభిమానులను నిరాశపరిచింది. అందుకే ఈ సినిమా తర్వాత నితిన్ తన తదుపరి సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. కేథరిన్ త్రెసా, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ఇతర సపోర్టింగ్ రోల్స్‌లో నటించగా, సముద్రఖని మెయిన్ విలన్‌గా కనిపించిన ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించారు.

See also  ఓటిటి విడుదలకు సిద్ధమైన బ్రహ్మస్త్ర

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories